కొత్త సినిమా వస్తుంది అంటే సినిమా పై అంచనాలు ఉండేలా సినిమాను తెరకెక్కించాలని చిత్ర యూనిట్ అనుకుంటుంది.కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలో కీలక సన్నీవేశాలను జాప్యంగ ఉంచాలని అనుకున్నా కూడా ఏదొక విధంగా ఎక్కడో ఒకచోట సినిమా సీన్ లీక్ అవుతుంది.స్టార్ హీరోల సినిమాలు దాదాపు లీక్ అవుతూన్నాయి..ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు కూడా లీకుల బెడద తప్పలేదు. తాజాగా మరో సినిమాకు భారీ షాక్ తగిలింది.సినిమా నుంచి కీలక సన్నీవేశాలకు సంభందించిన ఒక సీన్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. దీని పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..


ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 షూట్ లో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా పంజాబ్, ముంబై, పూణే, రాజమండ్రి లొకేషన్స్ లో షూటింగ్స్ జరుపుకుంది.రెండు పాటలు కూడా షూటింగ్ అయిపోయాయి. ప్రస్తుతం వైజాగ్ లో గత మూడు రోజుల నుంచి ఈ సినిమాని షూట్ చేస్తున్నారు..చరణ్ సినిమాకు షాక్ ఇచ్చేలా సినిమా సీన్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కోడుతుంది..శంకర్ షూటింగ్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నా ఏదో ఒక రకంగా ఈ సినిమా నుంచి పిక్స్ కానీ, షూటింగ్ వీడియో బైట్స్ కానీ లీక్ అవుతున్నాయి. ఇప్పటికే పంజాబ్, రాజమండ్రి పరిసరాలలో షూటింగ్ జరిగినప్పుడు పిక్స్ లీక్ అయ్యాయి.

 

తాజాగా వైజాగ్ లో ఓ సాంగ్ షూట్ చేస్తుండగా రోడ్ మీద రామ్ చరణ్ డాన్స్ చేస్తున్న వీడియోని లీక్ చేశారు.వైజాగ్ రోడ్ల మీద చరణ్ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తో కలిసి చిందేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది లవ్ సాంగ్ కి సంబంధించిన వీడియో అని తెలుస్తుంది. చరణ్ ఫాన్స్ ఇందులో డాన్స్ చూసి రామ్ చరణ్ అదరగొట్టేస్తున్నాడు అంటూ ఈ వీడియోని ఇంకాస్త వైరల్ చేస్తున్నారు. ఈ సీన్స్ లీక్ అవ్వడం పై చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరి చిత్ర యూనిట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.మరింత సమాచారం తెలుసుకోండి: