బాలీవుడ్ ఇండస్ట్రీ పై తనకు పెద్దగా ఆశక్తి లేదనీ అదేవిధంగా తన ఫిజిక్ బాలీవుడ్ సినిమాలకు పెద్దగా సూటవ్వదు అంటూ ‘సర్కారు వారి పాట’ మూవీ ప్రమోషన్ లో మహేష్ చేసిన కామెంట్స్ దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. మహేష్ వెంటనే ఎలర్ట్ అయి మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తనకు హిందీ సినిమాలు చేయడం ఇష్టమే అంటూ చేసిన కామెంట్స్ వెనుక రాజమౌళి ఇచ్చిన సూచనలు కీలకంగా పనిచేసి ఉంటాయి అన్న అంచనాలు వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారంమేరకు రాజమౌళి మహేష్ తో తీయబోతున్న మూవీకి 800 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని అంచనా వేసినట్లు టాక్. దక్షిణాఫ్రికా దట్టమైన అడవులలో ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఏఒక్కటి షూట్ చేయని లోకేషన్స్ లో ఈమూవీని షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈమూవీలో కూడ భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయని అంటున్నారు.


ఈమూవీకి ఒక బాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడ భాగస్వామి కాబోతోందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో మహేష్ తనకు బాలీవుడ్ పై పెద్దగా ఆశక్తిలేదు అని చెప్పడంతో జక్కన్న ఖంగారు పడినట్లు టాక్. ఒకవైపు పాన్ ఇండియా మూవీలో మహేష్ నటిస్తూ తనకు బాలీవుడ్ ఎంట్రీ పై ఆశక్తి లేదు అని చెపితే భవిష్యత్ లో బాలీవుడ్ మీడియా నుండి ఎదురుదాడి వస్తుందని గ్రహించిన రాజమౌళి మహేష్ చేత మాటమార్పించి తనకు బాలీవుడ్ సినిమాలంటే చాల ఇష్టమని అనే అర్థం వచ్చేడట్లుగా మహేష్ తో మాట్లాడించి ఉంటాడని అంచనాలు వస్తున్నాయి.


ఇది ఇలా ఉంటే ‘ఆర్ ఆర్ ఆర్’ కథ విషయంలో కొంత అసంతృప్తి కొందరికికలిగిన పరిస్థితిలో అటువంటి పొరపాట్లు జరగకుండా ఈమూవీ కథ విషయంలో 6నెలలు రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో ఆలోచనలు చేస్తాడట. కథ ఫైనల్ అయిన తరువాత మహేష్ కు చెప్పి అక్కడ నుండి తనకు ఎలాంటి ఫిజిక్ మహేష్ లో ఉండాలో స్పష్టంగా తెలియచేసి ఆవిధంగా తయారు కావడానికి మహేష్ కు 4నెలలు సమయం ఇస్తాడట. ఇవన్నీ ఇలా జరిగితే రాజమౌళి మహేష్ ల మూవీ వచ్చే సంవత్సరం సమ్మర్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: