సాదారణంగా సినిమాలలో నటించే వాళ్ళకు ఏదొక విధంగా బాధలు తప్పవు.. సినిమాల కన్నా కూడా బయట ఎక్కువగా గొడవలు పడుతున్నారు.. తాజాగా మరో నటికి సంభందించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.విషయాన్నికొస్తే.. ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఎప్పుడు ఏదొక విషయం పై వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మొన్నీమధ్య ఓ ఘటనతో బాగా ఫెమస్ అయిన ఈమె ఇప్పుడు మరో విషయం తో  హాట్ టాపిక్ అయ్యింది. చిన్న విషయానికి కూడా పెద్దగా రియాక్ట్ అవుతుందనే విషయం అందరికి తెలుసు.. అసలు ఈరోజు జరిగిన మ్యాటర్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కెలా చేసింది..


కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో హైలెట్ అయ్యింది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ బస్తీలోప్రముఖ సినీనటి కరాటే కల్యాణి యూట్యూబర్‌ శ్రీకాంత్‌ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఇద్దరు ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారు.. ఇద్దరి మధ్య కాసేపు తీవ్ర ఘర్షణ జరిగింది. రోడ్డు మీద అందరు చూస్తుండగానే కొట్టుకున్నారు.గొడవ తర్వాత ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ప్రాంకులు చేస్తున్నాడనే కోపంతో దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది.


ఈ దాడిలో శ్రీకాంత్‌ రెడ్డికి గాయాలయ్యాయి. ఈ గొడవలో ఆమెతో పాటు మరో వ్యక్తి పాల్గొన్నాడు. ఈ ముగ్గురు కలిసి రోడ్డు పై కొట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కోడుతుంది.. అస్సలు ఎందుకు కొట్టుకున్నారు? ఇది ఫ్రాంక్ వీడియోనా? ఇంకేదైనా ఉందా? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉన్నాయి.. తాజా సమాచారం ప్రకారం అమ్మాయిల పై అసభ్య వీడియోలు చేస్తున్నాడని, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫ్రాంక్ వీడియోలు చేయడం వల్లే కళ్యాణి అతన్ని కొట్టినట్టు వార్త చక్కర్లు కోడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దాంతో ఇది చర్చనీయాంశంగా మారింది..
మరింత సమాచారం తెలుసుకోండి: