డాన్స్ మాస్టర్ గా టీనా సాదు అకస్మాత్తు మరణ వార్త తో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఎంతో యాక్టివ్ గా ఉండే టీనా ఇలా మరణించడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫేమస్ రియాల్టీ షో ఆట సీజన్ ఫస్ట్ విన్నర్ గా ఈమె గెలిచింది. ఆ తరువాత సీజన్ ఫోర్ కి కూడా న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది. గత కొద్దిరోజుల నుంచి సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉంటోంది ఈమె.


అయితే ఈమె మరణానికి కారణం హై బ్లడ్ ప్రెజర్ తో మరణించింది అని వార్తలు వినిపించాయి. అయితే ఈమె అలా మరణించిందా లేదా ఇంకేవైనా కారణాలు ఉన్నాయా.. టీనాది సహజ మరణమా అనే సందేశాలు కూడా కలుగుతున్నాయి. అసలు గోవాలో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్ కు చెందిన టీనా గోవాలో ఉండే రఘు ను వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయింది. అయితే నాలుగు రోజుల క్రితం ఈమె హైదరాబాదుకి రావడం జరిగిందట. అలా వచ్చిన టీనా కేవలం నాలుగు రోజుల గ్యాప్ లోనే మరణించడంతో ఆమె సన్నిహితులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.


హైదరాబాద్ కి  వచ్చినప్పుడు ఎంతో యాక్టివ్ గా కనిపించిన టీనా.. అలా సడన్ గా ఎలా చనిపోయింది అనే అనుమానాలు కూడా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. హైదరాబాదుకు వచ్చినప్పుడు తన స్నేహితులతో కొన్ని విషయాలను కూడా తెలియజేస్తూ..తాను మద్యానికి బానిస అయినట్లుగా కూడా చెప్పినట్లు సమాచారం. దీని నుండి బయటపడడానికి మళ్లీ షోలను చేయాలని అనుకున్నట్లుగా టీనా చెప్పినట్లు ఆమె సన్నిహితులు తెలియజేయడం జరిగింది. అంతలోనే ఆకస్మికంగా ఆమె మరణించడం పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గోవాలో ఉండడంతో ఈమె ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల ఆమె గుండెకు చాలా సమస్యలు వచ్చినట్లుగా ఆమె కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయం నిజమో కాదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: