2008 నవంబర్ 8న ముంబాయ్ తాజ్ హోటల్ లో జరిగిన ఉగ్ర మూకల దాడిని ఎదిరించి తన ప్రాణాలు పోగొట్టుకున్న మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా నిర్మించిన ‘మేజర్’ బయోపిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. జూలై లో విడుదలకాబోతున్న ఈమూవీ ప్రమోషన్ ను చాల ముందుగా మొదలుపెట్టి ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసారు.



ఈమూవీ ట్రైలర్ బాగుండి అంటూ అనేకమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రశంసల మధ్య కొన్ని విమర్శలు కూడ ఈమూవీ ట్రైలర్ పై రావడం చాలామందికి ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. ఈ మేజర్ కథలో పెళ్ళికి ముందే ప్రేమ ఉంది. ఇది యదార్థ విషయం. అయితే ఈ ప్రేమకు సంబంధించిన విషయంలో కొంచం దర్శకుడు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కొన్ని డీప్ రొమాంటిక్ సీన్స్ కూడ పెట్టాడు. ఇప్పుడు ఈ విషయం పైనే విమర్శలు వస్తున్నాయి.



దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఒక మేజర్ జీవితంలో ప్రేమ వివాహం ఉన్నంత మాత్రాన ఆ ప్రేమలోని రొమాంటిక్ సన్నివేశాలు అంత ఎక్కువగా చాపించాల అంటూ విమర్శలు మొదలైపోయాయి. ఒక మహోన్నత వ్యక్తి జీవితంలో ఉన్న ఆదర్శాలు ఎక్కువగా చూపించాలి కాని మధ్యలో రొమాన్స్ ముఖ్యమా అంటూ మరికొందరి వాదన. మహేష్ నిర్మాతగా ఉన్న ఈసినిమాకు ట్రైలర్ కట్ చేస్తున్నప్పుడు అలాంటి రొమాంటిక్ సీన్స్ లేకుండా జాగ్రత్తపడి ఉంటే బాగుండేది కదా అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి.


అయితే ఇదే విమర్శకులు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో చాల భిన్నంగా ప్రవర్తించారు. ఈసినిమాను మొదలుపెట్టినప్పటి నుండి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తిగా దేశభక్తి స్పూర్తితో ఉంటుందని చెపుతూనే వచ్చారు. అయితే ఈమూవీలో చరణ్ కు కానీ జూనియర్ కు కానీ ఒక డ్యూయట్ పెట్టకుండా అలియా భట్ లాంటి గ్లామర్ హీరోయిన్ ను సాదాసీదా గా రాజమౌళి చూపించడం న్యాయమా అంటూ ఈ విమర్శకులే మరో విధంగా కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ చూసిన వారికి ఒక సినిమా తీసి ప్రేక్షకులను అదేవిధంగా విమర్శకులను మెప్పించడం ఎంత కష్టమో అర్థం అవుతుంది..




మరింత సమాచారం తెలుసుకోండి: