సినిమాలో హీరో పాత్రకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే కమెడియన్ కూడా అంతే అవసరం ఉంటుంది. మరి ఆ ప్రకారం చూసినట్టు అయితే మన ఇండస్ట్రీలో చాలా మందే కమెడియన్స్ ఉండగా వారిలో లేడీ కమెడియన్ గా మంచి పేరు పొందింది కోవై సరళ. అయితే ఈమె పుట్టింది తమిళనాడులో అయినా.. తెలుగులో స్టార్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకోవటమే కాకుండా ఇండస్ట్రీలో బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ అంటే నవ్వురాని వారంటూ ఉండరు. అంతేకాదు వీరిద్దరి టైమింగ్ కి అలాగే ఫంచ్ కి ప్రజలలో అంత క్రేజ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే కోవై సరళ తన కెరియర్లో దాదాపుగా 850 పైగా సినిమాలలో నటించన ఆమె కొన్ని సంవత్సరాలుగా సినిమాలలోకనిపించటం తగ్గించేసింది. మరి అందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అయితే ప్రస్తుతం కోవై సరళ వయస్సు 60 సంవత్సరాలు కావడంతో ఆమెకి సినిమా అవకాశాలు తగ్గాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాగా సరళ స్ట్రైట్ గా సినిమా చేసి ఇంచుమించు ఏడు సంవత్సరాల పైన అవ్వటమే కాదు ఆమె తెలుగులో నిర్వహిస్తున్న ఎటువంటి ప్రోగ్రామ్స్ లేదా అవార్డు ఫంక్షన్ లలో కూడా కనిపించకపోవటం గమనార్హం. అయితే ప్రస్తుతం ఈమె కేవలం తమిళ సినిమాల్లో
అడపాదడపా సినిమాలు చేస్తూ నటిస్తోంది. కాగా తెలుగులో మాత్రం అసలు సినిమాలు చేయట్లేదు.. దానికి కారణం ఆమెకు ఇక్కడ సరైన అవకాశాలు రాకపోవటమే అనే వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఇన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత కూడా తెలుగులో మళ్లీ సినిమా అవకాశాలు వస్తే చేస్తారా అనే ప్రశ్న సమాధానంగా కోవై సరళ మాట్లాడుతూ తెలుగు సినిమాలు తప్పకుండా చేస్తానుకాకపోతే నచ్చిన పాత్రలు వస్తేనే చేస్తాను అని, అలంటి ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని కూడా చెప్పారు. ఇక ఏదిఏమైనప్పటికీ  ఇంతటి స్టార్ కమెడీయన్ తెలుగు సినిమాలలో కనిపించకపోవడం ప్రేక్షకులకు కాస్త బాధాకరమైన విషయమే అని చెప్పవచ్చు. కాగా కోవై సరళకి మళ్ళి తెలుగు సినిమాలలో మునిపటిలా అవకాశాలు రావాలని ఆశిద్దాము.

మరింత సమాచారం తెలుసుకోండి: