సర్కారు వారి పాట టైటిల్ ని ఫిక్స్ చేసిన దగ్గర నుంచే ఈ సినిమాపై అభిమానుల్లో ఇంకా కామన్ ఆడియన్స్ లలో ఆసక్తి ఎక్కువగా పెరిగి పోయింది.టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా.."గీతా గోవిందం" ఫేమ్ క్లాసిక్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందిన ‘సర్కారువారి పాట’ నిన్ననే థియేటర్స్ లోకి వచ్చింది.రావడం రావడంతో సునామిలా దూసుకుపోతుంది. సూపర్ స్టార్ మహేష్ కి యాంటీగా వున్న హీరోల ఫ్యాన్స్ సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని తెలిసి అసూయతో తట్టుకోలేక సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ సినిమాని తొక్కేయాలని చూశారు. సోషల్ మీడియాలో ఒక రేంజిలో నెగటివిటీని స్ప్రెడ్ చేశారు. కానీ మహేష్ స్టామినా ముందు అవేమి నిలబడ లేకపోయాయి. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా మాక్సిమం జనాలు సినిమా చూసి చాలా బాగుందని చెప్పడంతో మొత్తానికి సర్కారు వారి పాట రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రతి ఏరియాలో కూడా నాన్ రాజమౌళి రికార్డ్స్ క్రియేట్ చేసింది.ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. మహేష్ ఫ్యాన్స్ చెప్పినట్లుగానే ఈ సినిమా పాన్ ఇండియా సినిమాల రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో కలిపి ఈ సినిమా ఏకంగా 36.89 కోట్ల షేర్ రాబట్టి మహేష్ ని బాక్స్ ఆఫీస్ కింగ్ గా నిలబెట్టింది. ఇక అన్ని ఏరియాస్ కలుపుకోని ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 46 కోట్ల షేర్ రాబట్టగా అలాగే గ్రాస్ పరంగా 75 కోట్లు కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ ని ఊచకొతకోయించింది.ఇక మహేష్ అడ్డా అయిన యూ ఎస్ లో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో ఏకంగా 1.3 మిలియన్ డాలర్ల వసూళ్ళని రాబట్టి మహేష్ కెరీర్ లోనే  యూ ఎస్ లో 1 మిలియన్ డాలర్లు సాధించిన 11 వ సినిమాగా నిలిచింది. ఇది ఏ హీరోకి లేనటువంటి రికార్డు. కేవలం మహేష్ కి మాత్రమే ఈ రికార్డ్ వుంది. ఇలా ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టి సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: