టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్వరలో కొరటాల శివ ఒక భారీ మూవీ తీయనున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎంతో భారీ ఎత్తున తెరకెక్కనున్న ఈ సినిమాపై యంగ్ టైగర్ ఫ్యాన్స్ తో పాటు అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా ఒక యువ భామ నటించనుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు టాక్.

ఇప్పటికే ఈ మూవీ కోసం పలు భారీ సెట్స్ రూపొందించే పనిలో యూనిట్ నిమగ్నమై ఉందని, అనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావచ్చినట్లు చెప్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన ఎన్టీఆర్, ఎలాగైనా కొరటాల శివ మూవీతో కూడా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. మంచి యాక్షన్ తో పాటు కమర్షియల్ పంథాలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అదిరిపోతుందని సమాచారం. అనే దీని తరువాత ప్రఖ్యాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ ఒక మూవీ చేయనున్నారు.

మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవల వచ్చింది. అయితే అసలు విషయం ఏంటంటే, ఈ రెండు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ఈ నెల 20న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే ఈ రెండు సినిమాల కోసం విడి విడిగా ప్రత్యేకంగా ఫోటో షూట్స్ చేసిన ఎన్టీఆర్, తన బర్త్ డేకి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారని అంటున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆరోజున పెద్ద పండుగే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: