యాంగ్రీ హీరో రాజశేఖర్ తన కెరియర్లోనే 91వ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం శేఖర్. ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఈ చిత్రం వాయిదా పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. లలిత్ డైరెక్షన్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది కానీ చివరికి ఈ ప్రాజెక్టుని జీవిత రాజశేఖర్ కంప్లీట్ చేసింది. మలయాళం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న జోసెఫ్ చిత్రం ఇది రీమేక్ గా తెరకెక్కిన చిత్రం జరుగుతోంది.

ఇందులో ఎం ఎల్ వి సత్యనారాయణ తో పాటు రాజశేఖర్ కూతురు శివాని ,శివాత్మిక లు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ట్రైలర్, టీజర్ బాగానే ఉన్నప్పటికీ.. ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ చిత్రం వాయిదా పడుతున్నట్లు చిత్రబృందం ఇంకా కన్ఫామ్ చేయలేదు. అందుకు కారణాలు కూడా ఇంకా బయటికి రావడం లేదు కేవలం సర్కారు వారి పాట, f-3 సినిమాలకు మధ్యలో వస్తే ఫలితం తేడా కొట్టే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే వీరు వెనక్కి తగ్గారని అనుమానాలు వినిపిస్తున్నాయి. మొదట ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 4 రాజశేఖర్ పుట్టినరోజుకి విడుదల చేయాలనుకున్నారు.


కానీ అది కూడా సక్సెస్ కాలేక పోవడంతో ఈ నెల 20వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు కానీ ఇప్పుడు ఇది కూడా ఎప్పుడు విడుదల చేస్తారో తెలియకపోవడంతో చిత్ర బృందం సతమతమవుతున్నారు. ఇక ఇందులో రాజశేఖర్ రిటైర్డ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓ టి టి లో విడుదల చేయడానికి పలు ఆఫర్లు వచ్చాయని కానీ జీవిత రాజశేఖర్లు పట్టుబడి ఈ చిత్రాన్ని కేవలం థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: