మాస్ మహారాజా రవితేజ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ తన కెరియర్ ను చిన్న చిన్న పాత్రల ద్వారా మొదలు పెట్టి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరో లలో  ఒకరిగా మారిపోయాడు.  రవితేజ హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రస్తుతం వరుస పెట్టి సినిమా లలో నటిస్తూ వస్తున్నాడు. క్రాక్ మూవీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఆ తర్వాత ఖిలాడి సినిమాతో బాక్సాఫీసు దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్నాడు.

రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ , ధమాకా ,  రావణాసుర ,  టైగర్ నాగేశ్వరరావు సినిమాలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ నాలుగు సినిమాల షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతోంది. ఇలా నాలుగు సినిమాలు సెట్స్ పై ఉండగానే మాస్ మహారాజా రవితేజ మరో సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.  ఈ సారి మాస్ మహారాజా రవితేజ తమిళ్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే...  మారి 1 మరియు మారి 2 సినిమా లతో తమిళ్ , తెలుగు ఇండస్ట్రీలలో మంచి విజయాలను అందుకున్న బాలాజీ మోహన్ కు రవితేజ  అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.  మారి 1 , మారి 2 సినిమాలతో పాటు  బాలాజీ మోహన్  లవ్ ఫెయిల్యూర్ అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.

సినిమా కూడా పర్వాలేదు అనే రిజల్ట్ ను తెచ్చుకుంది.  ప్రస్తుతం ఈ దర్శకుడు రవితేజ కు ఒక కథ చెప్పినట్లు, రవితేజ కు బాలాజీ మోహన్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆ సినిమా స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలియనునట్లు  సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: