ప్రతి సినిమా ఇండస్ట్రీ లోను  కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. అలా కొంత మంది క్రేజీ కాంబినేషన్ లలో సినిమా ఎప్పుడు వస్తుందా... ఎప్పుడు చూద్దామా... అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి క్రేజీ కాంబినేషన్ లలో బాలకృష్ణ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి. బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇప్పటి వరకు సింహ , లెజెండ్ , అఖండ సినిమాలు తెరకెక్కాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒక దానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర సాధించడం మాత్రమే కాకుండా,  అదిరిపోయే కలెక్షన్ లను కూడా బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాయి.  

ఇలా ఇప్పటి వరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు కూడా బ్లాక్బస్టర్ విజయాలు కావడంతో వీరి కాంబినేషన్లో 4 వ సినిమా ఎప్పుడు వస్తుందా... ఎప్పుడు చూద్దామా... అని ఎంతో మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  అయితే ప్రస్తుతం వీరి నాలుగోవ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే... ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం బాలకృష్ణ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నాలుగోవ సినిమా తెరకెక్కబోతోంది అని,  వీరిద్దరి కాంబినేషన్ లో  రాబోతున్న 4 వ సినిమా అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామా గా తెరకెక్కబోతోంది అని ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. అలాగే బోయపాటి శ్రీను, రామ్ పోతినేని తో ఒక సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఆ తర్వాత బాలకృష్ణ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: