అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన నవ్వుల ఆటంబాంబు లాంటి సినిమా ఎఫ్ 3 మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ చిత్ర బృందం మొత్తం ప్రస్తుతం ప్రమోషన్లో బిజీబిజీగా ఉంది. అయితే సాధారణంగా సీక్వల్  అంటే ముందు ఉన్న కథకు కొనసాగింపుగా మరో సినిమాను తెరకెక్కిస్తు ఉంటారు. కానీ ఇప్పుడు తాము తెరకెక్కించిన సినిమా మాత్రం సినిమాకు అస్సలు సంబంధం లేదు అంటూ దర్శకుడు చెబుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా పై మరింత ఆసక్తి పెరిగిపోయింది అని చెప్పాలి. ఇక ఇటీవల ఎఫ్ 3 ట్రైలర్ విడులై సోషల్ మీడియాలో సెన్సేషన్  సృష్టించింది


 ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరోసారి థియేటర్లో నవ్వుల సునామి తప్పదు అని అర్థమవుతుంది. కాగా ఇక ఎఫ్ 2 సినిమాలో ఉన్నట్లుగానే ఈ సినిమా లో వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహరీన్ నటిస్తున్నారు. ఇక వీరితో పాటు సునీల్, బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ కూడా ఎఫ్ త్రీ సినిమాలో కనిపించబోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ లో సోనాల్ చౌహాన్ పాత్ర ఎలా ఉంటుంది అన్నది చూపించలేదు. దీంతో ఈ పాత్ర గురించి మరింత ఆసక్తి పెరిగిపోయింది అని చెప్పాలి. కాగా ఎఫ్ త్రీ సినిమాలో తన పాత్ర గురించి ఇటీవలే హీరోయిన్ సోనాలి చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మూవీలో నాది చాలా చాలా కీలకమైన పాత్ర ట్రైలర్ లో ఎక్కడా కనిపించలేదు ఇక నా పాత్రతోనే సినిమా మొత్తం మలుపు తిరుగుతోంది అంటూ సోనాల్ చౌహాన్ చెప్పుకొచ్చింది. అయితే తన కెరియర్ లో ఫుల్ లెంత్ కామెడీ ఫిలిం లో నటించడం మొదటిసారి అంటూ తెలిపింది. ఈ సినిమాలో నటించడం ద్వారా కామెడీ చేయడం చాలా కష్టం అన్న విషయం అర్థమైంది.  అంతేకాదు నా పాత్ర కోసం ఏదైనా సినిమా చూడ మంటారా అని దర్శకుడిని అడిగినప్పుడు ఆయన ఎంతో కూల్గా షూటింగ్ కు వచ్చేయండి అంటూ చెప్పారు అని తెలిపింది సోనాల్ చౌహాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

F3