హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా బాలకృష్ణ సినిమా లలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. బాలకృష్ణ సినిమా లతో పాటు మరి కొన్ని సినిమాల్లో కూడా సోనాల్ చౌహాన్ నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోనాల్ చౌహాన్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది.

ఎఫ్ 3 సినిమా ఈ నెల 27 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఎఫ్ 3 మూవీ లో కీలక పాత్రలో నటించిన సోనాల్ చౌహాన్సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సోనాల్ చౌహాన్ తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెప్పుకొచ్చింది. అందులో సోనాల్ చౌహాన్ ప్రస్తుతం నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నాను.

ది ఘోస్ట్ మూవీ లో నాది ఫుల్ యాక్షన్ రోల్ అని సోనాల్ చౌహాన్ చెప్పుకొచ్చింది. కొంత కాలం పాటు షూటింగ్ కు బ్రేక్ పడిన ది ఘోస్ట్  మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. గరుడ వేగ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ది ఘోస్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి సోనాల్ చౌహాన్ 'ఎఫ్ 3' మరియు ది ఘోస్ట్ సినిమా లతో ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: