2022 వ సంవత్సరంలో ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన 5 ఇండియన్ సినిమాల గురించి తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 235 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్ లుగా నటించగా సముద్ర ఖని, అజయ్ దేవగన్, శ్రేయ ఈ మూవీ లో  ముఖ్య పాత్రల్లో నటించారు.  ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చగా , డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మించారు.


కే జి ఎఫ్ చాప్టర్ 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా రవి బుస్రుర్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదలైన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 164.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.


బీస్ట్ : నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా అనిరుద్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 86.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


రాధే శ్యామ్ : రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా యు.వి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 67 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: