సీనియర్ నటుడు వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 సినిమా గురించి అందరికి తెలుసు..వన్ మ్యాన్ షో గా థియెటర్ల లోకి వచ్చి బాక్సాఫిస్ ను షేక్ చేసింది.ఆ ఏడాది మొత్తానికి ఆ సినిమా హైలెట్ గా నిలిచింది.ఈ సినిమా కు సీక్వెల్ గా ఇప్పుడు ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించారు.ఆ సినిమాలో ఇంకాస్త ఫన్ ఉంటుందని అందరు అంటున్నారు. చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను జనాల్లొకి తీసుకెల్లాలని భారీ ప్లానులు వేస్తూ వస్తున్నాడు. ఇటీవల షూటింగ్ ను పూర్తీ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.దాంతో సినిమా ప్రమోషన్స్ ను కూడా పెంచేసారు.


ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా అంచనాలను పెంచేస్తున్నాయి.ప్రీరిలిజ్ బిజినెస్ మాత్రం భారీ స్థాయిలో ఉంది..సినిమా షూటింగ్ పూర్తీ అయిన తర్వాత నుంచి అనిల్ ప్రమోషన్స్ ను వెరైటీగా చేస్తున్నాడు. ఈ మేరకు పలు టీవీ షో లకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు... ఈ సినిమా గురించి హీరోయిన్ సొనాల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.అందులో భాగంగా కొన్ని సంచలన విషయాలను చెప్పింది.


ఆమె మాట్లాడుతూ.. ''లెజెండ్‌ సమయంలో అనిల్‌ రావిపూడి నాకు పరిచయం అయ్యారు. 'మనం కలిసి వర్క్‌ చేద్దాం' అన్నారు. కానీ.. ఆయన్నుంచి ఫోన్‌ రావడానికి చాలా కాలం పట్టింది. ఎట్టకేలకు 'ఎఫ్‌ 3'లో నాకు అవకాశం ఇచ్చారు. అంతకు ముందే నేను 'ఎఫ్‌ 2' చూశాను. కామెడీ పంచడంలో అనిల్‌ రావిపూడి కింగ్‌. అందుకే మరో ఆలోచన లేకుండా 'ఎఫ్‌ 3'లో నటించడానికి ఒప్పుకొన్నా. ఈ సినిమాలో నా పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. నా పాత్ర ఓ ట్విస్ట్‌కి కారణం అవుతుంది. అది రివీల్‌ అయినప్పుడు అంతా ఆశ్చర్యపోతారు. అందుకే ట్రైలర్‌లోనూ నన్ను దాచి పెట్టారు. ఈ సినిమాలో చాలా పాత్రలున్నప్పటికీ అందరికీ ప్రాధాన్యం ఉంటుంది. పూర్తిస్థాయి వినోద భరిత చిత్రం చేయడం నా కెరీర్‌లో ఇదే తొలిసారి..ఈ సినిమా నా కెరియర్ ని మారుస్తుంది అని ఆమె అంటుంది.మరి సినిమా ఎలా ఉంటుందో 27 న తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

F3