మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. మొదటిసారి ఫుల్ లెంత్ లో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తూ ఉండడం, కొరటాల శివ 'ఆచార్య'  సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో మెగా అభిమానులతో పాటు మాములు సినీ అభిమానులు కూడా ఆచార్య మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 29 వ తేదీన గ్రాండ్ గా థియేటర్ లలో విడుదలైన ఆచార్య సినిమా విడుదలయిన మొదటి షో నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర  నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

విడుదలైన మొదటి షో నుండే ఆచార్య సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కూడా అతి తక్కువగా వస్తున్నాయి.  ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమా మే 20 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన ఫెయిల్యూర్ కావడంతో ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమా కథ లలో  అనేక మార్పులు చేర్పులు చేయాలని  చిరంజీవి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.  

అందులో భాగంగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా కథ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కొన్ని మార్పులు... చేర్పులు సూచించినట్లు తెలుస్తోంది.  అందుకు అనుగుణంగా కథ లో కొన్ని మార్పులు... చేర్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భోళా శంకర్ సినిమా తమిళ  సూపర్ హిట్ మూవీ వేదళం  సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది.  భోళా శంకర్ మూవీ లో  మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ మూవీ లో  చిరంజీవి కి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: