ఒక సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నట్లు అయితే ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిన సందర్భంలో ఆ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకోవడం అనేది చాలా సర్వ సాధారణ మైన విషయం.  అలాగే భారీ అంచనాలు ఉన్న సినిమాలకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం కూడా చాలా సర్వసాధారణమైన విషయం.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉండి మోస్ట్ క్రేజీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ లలో ఎఫ్ 3 సినిమా ఒకటి. ఎఫ్ 2 సినిమా మంచి విజయం సాధించడంతో ఎఫ్ 3 సినిమా పై భారీ అంచనాలను ప్రేక్షకులు పెట్టుకున్నారు.

దానితో ఎఫ్ 3 సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే... అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా భారీ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎఫ్ 2 సినిమా తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఆ తర్వాత   ఎఫ్ 2 సినిమాకు ప్రాంచేజి గా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించాడు.  ఈ సినిమాలో కూడా వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా తమన్నా, మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు.  ఎఫ్ 3 సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది.  ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ఎఫ్ 3 మూవీ కి 50 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ఒక వార్త వైరల్ అవుతుంది.  ఒక వేళ ఈ వార్త కనుక నిజం అయితే ఇప్పటి వరకు వెంకటేష్ , వరుణ్ తేజ్ కెరియర్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను  జరుపుకున్న సినిమాగా ఎఫ్ 3 సినిమా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: