ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్ హీరోలకు జోడిగా హీరోయిన్ లను సెలెక్ట్ చేయడం దర్శకులకు కాస్త కష్టమైన పనే ఎందుకంటే, హీరో ,  హీరోయిన్ ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలను లేదా లవ్ ట్రాక్ లను పెట్టాలి అన్న , వారి ఇద్దరి మధ్య ఏజ్ సమస్య రావడం వల్ల ప్రేక్షకులకు ఆ రొమాంటిక్ సన్నివేశాలు , లవ్ ట్రాక్ లు ఇబ్బందిని కలగజేస్తాయి.  అందుకోసం అని సీనియర్ హీరోలతో నటించడానికి ఏ ఇండస్ట్రీలో అయినా కొంత మంది హీరోయిన్ లు మాత్రమే ఉంటారు. అలా మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోల సరసన నటించడానికి కూడా కొంత మంది హీరోయిన్ లు మాత్రమే ఉన్నారు అలా స్టార్ సీనియర్ హీరోల సరసన నటించి , ప్రస్తుతం నటిస్తున్న ఈ ముద్దుగుమ్మల గురించి తెలుసుకుందాం.

తమన్నా : ఇప్పటికే తమన్నా,  మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించింది.  అలాగే వెంకటేష్  హీరోగా తెరకెక్కిన ఎఫ్ 2 సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా నటించింది.  ప్రస్తుతం వెంకటేష్ సరసన తమన్నా ఎఫ్ 3 మూవీ లో హీరోయిన్ గా నటిస్తుండగా,  చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.


నయనతార : నయనతార టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి,  బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున లాంటి అందరి సరసన నటించి మెప్పించింది.


శృతి హాసన్ : ఇంత కాలం వరకు సీనియర్ స్టార్ హీరోల సరసన నటించని  శృతి హాసన్ ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలు అయిన చిరంజీవి,  బాలకృష్ణ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

 
కాజల్ అగర్వాల్ : ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.  కాకపోతే కథకు అనుగుణంగా కాజల్ అగర్వాల్  పాత్ర లేకపోవడంతో ఆ పాత్రను సినిమా నుండి తప్పించారు.


ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరితో పాటు మరికొంత మంది హీరోయిన్లు మాత్రమే స్టార్ సీనియర్ హీరోల సినిమాలలో ఫస్ట్ ప్రిఫరెన్స్ హీరోయిన్లుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: