టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగ చైతన్య ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే నాగ చైతన్య , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టొరీ మూవీ తో మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటించింది.  అలాగే నాగ చైతన్య ,  నాగార్జున హీరోగా తెరకెక్కిన బంగార్రాజు చిత్రం లో  కూడా కీలక పాత్రలో నటించాడు.  కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో  నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.  

సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.  ఇలా  రెండు వరుస విజయా లతో  ఫుల్ ఫామ్ లో ఉన్న నాగ చైతన్య ప్రస్తుతం థాంక్యూ మూవీ లో  హీరోగా నటించాడు.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.  ప్రస్తుతం ఈ సినిమా సంబంధించిన నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.  థాంక్యూ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తుండగా ఈ మూవీ లో నాగ చైతన్య సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది.

థాంక్యూ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది.  తాజాగా థాంక్యూ చిత్ర బృందం ఈ మూవీ ని 8 జూలై 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్మెంట్ చేసింది. మరి రెండు వరుస విజయా లతో ఫుల్ ఫామ్ లో ఉన్న నాగ చైతన్య 'థాంక్యూ'  మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: