సూపర్ స్టార్ మహేష్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ పెట్ల తీసిన ఈ సినిమా రెండు రోజుల క్రితం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమా ప్రీమియర్స్ తో పాటు సోషల్ మీడియా లో కూడా యావరేజ్ టాక్ ట్రెండ్ కొనసాగినప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీలో టాక్ తో సంబంధం లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు తన కలెక్షన్స్ సత్తా చూపిస్తున్నారు.
మహేష్ బాబు ఈ సినిమాలో ఒక వడ్డీ వ్యాపారస్థుడిగా కనిపించగా కీర్తి సురేష్ ఒక ధనిక యువతీగా తన కెరీర్ లో ఇప్పటివరకు చేయని ఒక డిఫరెంట్ రోల్ చేసారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకి మది ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించగా 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై ఎంతో భారీ ఎత్తున రూపొందింది. మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్, యాక్షన్ అంశాలతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు పరశురామ్సినిమా తీశారు.

మహేష్, కీర్తిలవ్ ట్రాక్, కామెడీ సీన్స్, యక్షన్, భారీ ఫైట్స్, సాంగ్స్, బీజీఎమ్, అదిరిపోయే విజువల్స్ తో దూసుకెళ్తున్న సర్కారు వారి పాట మొత్తంగా గడచిన రెండు రోజుల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 48 కోట్ల 53 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి యూనిట్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక నేడు, రేపు వీకెండ్స్ కావడంతో ఈ రెండు రోజుల్లో కూడా మహేష్ బాబు తన హవాతో సర్కారు వారి పాటని మరింతగా ముందుకు తీసుకెళ్లడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. కాగా ఈ సినిమా ఓవరాల్ గా రూ. 121 కోట్ల మేర బిజినెస్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: