యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర విడుదలైన మొదటి రోజు నుండే నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. విడుదల అయిన మొదటి రోజు నుండే నెగెటివ్ టాక్ ను బాక్సాఫీస్ దగ్గర తెచ్చుకున్న రాధే శ్యామ్ మూవీ  చివరగా ఫ్లాప్ గా మిగిలింది.

ఇలా రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకులను నిరాశ పరిచిన ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ ,  నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్టు కే , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్నడు. ఇది ఇలా ఉంటే తాజాగా సలార్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్తను సలార్ సినిమా ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.  విజయ్ కిరగందుర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సలార్ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 30 నుంచి 35 శాతం వరకు పూర్తి అయ్యింది.

తదుపరి షెడ్యూల్ వచ్చే వారం నుండి మొదలు కానుంది.  సలార్ సినిమా షూటింగ్ మొత్తాన్ని అక్టోబర్ లేదా నవంబర్ లోగా పూర్తి చేస్తాం.  2023 సమ్మర్ లో సలార్ సినిమాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తాజా ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ తెలియజేశాడు.  ఇది ఇలా ఉంటే సలార్ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.  కే జి ఎఫ్ సినిమా తో ప్రశాంత్ నీల్  పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం తో సలార్ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు సినీ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: