లోకనాయకుడు కమల్ హాసన్ వెండితెరపై సందడి చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. విశ్వరూపం సినిమాతో వెండితెరపై ప్రేక్షకులను అలరించిన కమల్ హసన్ ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో భారతీయుడు మూవీ కి స్పీక్వెల్ గా భారతీయుడు 2 సినిమాను ప్రారంభించాడు. భారతీయుడు 2 షూటింగ్ ని ప్రారంభించిన తర్వాత కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల భారతీయుడు 2 సినిమా షూటింగ్ నిలిచిపోయింది.  

కొన్ని అనివార్య కారణాల వల్ల భారతీయుడు 2 షూటింగ్ ఆగిపోవడంతో కమల్ హాసన్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విక్రమ్ సినిమాను మొదలుపెట్టాడు.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులను జరుపుకుంటోంది. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి , ఫాహాద్ ఫాజిల్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. మానగరం , ఖైదీ , మాస్టర్ వంటి వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న దర్శకుడు లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్ లను మొదలుపెట్టింది. అందులో భాగంగా విక్రమ్ చిత్ర బృందం తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను కూడా విడుదల చేయగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతాన్ని సమకూర్చాడు.  అలాగే రేపు అనగా మే 15 వ తేదీన విక్రమ్ మూవీ ట్రైలర్ మరియు ఆడియోను విడుదల చేయబోతున్నారు.  ఇలా విక్రమ్ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ లను వేగవంతం చేస్తోంది. మరి విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: