సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటించిన విషయం  మన అందరికీ తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.  భరత్ అనే నేను, మహర్షి , సరిలేరు నీకెవ్వరు లాంటి  వరుస బ్లాక్ బస్టర్ లతో ఫుల్ ఫామ్ లో ఉన్న మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా నటించడం,  గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ విజయంతో ఫుల్ ఫామ్ లో ఉన్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సర్కారు వారి పాట సినిమాపై మహేష్ అభిమానులతో పాటు మాములు సినీ అభిమానులు కూడా భారీ అంచనాలను  పెట్టుకున్నారు. 

అలా భారీ అంచనాలతో మే 12 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన సర్కారు వారి పాట సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. అలా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకున్న సర్కారు వారి పాట సినిమా రెండు రోజులు బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 58.21 కోట్ల షేర్ కలెక్షన్లను , 90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి ఫుల్ స్పీడ్ లో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది.  ఇలా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని సర్కారు వారి పాట సినిమా అదిరిపోయే కలెక్షన్లను రాబడుతోంది.  

సర్కారు వారి పాట సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన న్యూస్ ను తాజాగా చిత్ర బృందం అనౌన్స్ చేసింది.  సమ్మర్ సన్సేషనల్ బ్లాక్ బాస్టర్ 'మా మా మాస్ సెలబ్రేషన్స్'  మే 16 వ తేదీన సాయంత్రం 5 గంటలకు సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ పిన్నమనేని పోలి క్లినిక్ విజయవాడలో 'సర్కారు వారి పాట' సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరపనున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ ను విడుదల చేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: