దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన  'ఆర్ ఆర్ ఆర్'  సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సాధించిందో మన అందరికీ తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదలైన అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని బ్లాక్ బస్టర్ కలెక్షన్లను కూడా బాక్సాఫీస్ దగ్గర రాబట్టింది. అందులో భాగంగా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ హిందీ లో కూడా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది.  ఇప్పటి వరకు ఏడు వారాల బాక్సాపీస్ రన్ ని పూర్తి చేసుకున్న 'ఆర్ ఆర్ ఆర్'  మూవీ హిందీ లో  ఒక్కో వారానికి చొప్పున ఏడు వారాలకు ఎన్ని కోట్ల కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించిందో తెలుసుకుందాం.

'ఆర్ ఆర్ ఆర్' మూవీ మొదటి వారం హిందీ లో  133.07 కోట్ల నెట్ కలెక్షన్ లను సాధించింది.

 
'ఆర్ ఆర్ ఆర్' మూవీ రెండవ వారం హిందీ లో  76.25  కోట్ల నెట్ కలెక్షన్ లను సాధించింది.

 
'ఆర్ ఆర్ ఆర్' మూవీ మూడవ వారం హిందీ లో  36 కోట్ల నెట్ కలెక్షన్ లను సాధించింది.

 
'ఆర్ ఆర్ ఆర్' మూవీ నాలుగవ వారం హిందీ లో  15.35  కోట్ల నెట్ కలెక్షన్ లను సాధించింది.

 
'ఆర్ ఆర్ ఆర్' మూవీ ఐదవ వారం హిందీ లో  7.60  కోట్ల నెట్ కలెక్షన్ లను సాధించింది.

 
'ఆర్ ఆర్ ఆర్' మూవీ ఆరవ వారం హిందీ లో  3.76 కోట్ల నెట్ కలెక్షన్ లను సాధించింది.

 
'ఆర్ ఆర్ ఆర్' మూవీ ఏడవ వారం హిందీ లో  1.85 కోట్ల నెట్ కలెక్షన్ లను సాధించింది.

 
ఇప్పటి వరకు హిందీలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ 273.90 కోట్ల నెట్ కలెక్షన్లను బాక్సాఫీసు దగ్గర వసూలు చేసింది. ప్రస్తుతం కూడా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: