ఒకప్పుడు బాలివుడ్ సినిమాలకు పెరిగిన క్రేజ్ ఇప్పుడు సౌత్ సినిమాలకు ఉంది. దాంతో దర్శకులు కూడా కొత్త జొనర్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ మేరకు స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకూ కూడా అందరు చేతిలో వరుస సినిమాల తో బిజీగా ఉన్నారు. ఈ మేరకు విలక్షణ నటుడు కమల్ హాసన్ సినిమా హిట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు..ఇప్పటికే ఎన్నో సినిమాలను జనాలకు అందించాడు.హీరో గానే కాకుండా నిర్మాథగా కూడా సినిమాలను చెస్తున్నారు కమల్..


భారీ స్టార్ క్యాస్టింగ్ తో మణిరత్నం పొన్నియిన్ సెల్వన్.. సీనియర్ హీరో కమల్ హాసన్ విక్రమ్.. తెలుగు స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి శంకర్ RC15 ఇలా తమిళ మేకర్స్ ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్సయ్యారు. దీని కోసం ముందుగా అక్కడి హీరోలు కూడా ఏకమయ్యే దారులు కూడా వెతుకుతున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు అజిత్-విజయ్ లతో మల్టీస్టారర్ ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పుడు కమల్ సినిమాను ఏకంగా ముగ్గురు హీరోలు సపోర్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.



లోకేష్ కనగ్ రాజ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్. కమల్ తో పాటు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముగ్గురు స్టార్ హీరోలతో పాటు మరో స్టార్ సూర్య కూడా గెస్ట్ గా కనిపించనున్నాడని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మే 15న అత్యంత గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు..ఈ కార్య క్రమానికి తలైవా రజినీ కాంత్ తలపతి విజయ్ తో పాటు సూర్య కూడా హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం..ఈ సినిమా భారీ హిట్ ను కొట్టడం ఖాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: