దక్షిణాది చిత్ర సీమ లో సరికొత్త ట్రెండ్ మొదలైంది.. మన వాళ్ళ సినిమాలు దేశవ్యాప్తంగా బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చు పెడుతూ ఉండడమే కాకుండా డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా భారీగానే వసూలు చేస్తున్నాయి. క్రేజీ స్టార్ లను నుంచి చిన్న హీరోల వరకు మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. పెరిగిన మార్కెట్ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూసర్లు కూడా స్టార్ హీరోలకు తగ్గట్టుగానే పారితోషకాలు కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మరికొంతమంది ప్రొడ్యూసర్ ఈ విషయంలో పోటీ పడి ఇవ్వడంతో ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది ఈ విషయం.

స్టార్ హీరో కెరీర్ లో ఒక పక్క బ్లాక్ బస్టర్ మూవీ కొడితే చాలు లైఫ్ సెటిల్ అయినట్లే అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ మాటలు బలంగా నాటుకు పోవడంతో స్టార్ హీరోలు అడిగినంత ఇస్తూ ఉన్నారు. ఈ వరుసలో దక్షిణాదిలో ఉన్న చాలా మంది స్టార్స్ చాలా కాస్ట్లీ అనిపించుకుంటున్నారు.. దాదాపుగా పది మంది హీరోల వరకు సౌత్లో తన రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకు షాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో చిత్రానికి 45 నుంచి 100 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను రాబడుతోంది అయితే ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్ విషయాని చూద్దాం.


ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నది తమిళ హీరో విజయ్ దళపతి.. ఆయన ఒక్కో చిత్రానికి 100 కోట్ల రూపాయల నుంచి పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక విజయ్ తర్వాతి స్థానంలో హీరో అజయ్ నిలిచాడు. అజిత్ తన 62 వ చిత్రానికి.. వంద కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీరి తరువాత మరొక స్థానంలో ఉన్నది హీరో రజనీకాంత్ ఆయన కూడా తన 149వ చిత్రానికి 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడట. ఇక ఆ తరువాత స్థానంలో ప్రభాస్ 80 కోట్లు.. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ 64 కోట్లు పవన్ కళ్యాణ్ 50 కొట్లు, మహేష్ 50 కోట్లు, రామ్ చరణ్ 45 కోట్లు, అల్లు అర్జున్ 40 కోట్లు, హీరో యష్ 20 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: