టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన నిఖిల్ సిద్ధార్థ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ సిద్ధార్థ్ 'హ్యాపీ డేస్'  మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.  హ్యాపీ డేస్ మూవీ తర్వాత అనేక సినిమాలలో నటించిన నిఖిల్ సిద్ధార్థ్ కి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయాలు దక్కలేదు. అలాంటి సమయం లోనే నిఖిల్ సిద్ధార్థ్ 'స్వామి రారా'  సినిమాలో హీరోగా నటించాడు. స్వామి రారా సినిమా మంచి విజయం సాధించడంతో నిఖిల్ మంచి ఫామ్ లోకి వచ్చాడు.  

ఆ తర్వాత నిఖిల్ నటించిన సినిమాలలో కార్తికేయ , ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. అలాగే కొన్ని సినిమాలు విజయాలను సాధించకపోయినప్పటికీ నిఖిల్ సిద్ధార్థ్ కథల ఎంపిక విషయంలో మాత్రం విమర్శకుల ప్రశంసలు పొందాడు.  ఇలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో గా కొనసాగుతున్న నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం రెండు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజిస్ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాతో పాటు నిఖిల్ సిద్ధార్థ్ , చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ 2 సినిమాలో హీరోగా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా నిఖిల్ సిద్ధార్థ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం  షూటింగ్ పూర్తి చేసుకున్న కార్తికేయ 2 సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. తాజాగా నిఖిల్ కార్తికేయ 2 సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్నాడు.  మేకర్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అందులో భాగంగా స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న నిఖిల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కార్తికేయ 2 సినిమాను 22 జూలై 2022 న విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: