పాన్ ఇండియా సినిమాలు చేసి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకోవాలి అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఆర్ఆర్ఆర్ మరియు ఆచార్య అనే రెండు సినిమాలు చేయగా వాటిలో ఆర్.ఆర్.ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఆచార్య సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యింది. అలా పాన్ ఇండియా మార్కెట్ లో 50 శాతం సక్సెస్ సాధించిన రామ్ చరణ్ కు ఇప్పుడు అన్ని కలిసొచ్చే అంశాలు ఎదురవుతూ ఉండడం మెగా అభిమానులను ఎంతగానో సంతో షపడుతుంది.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న చరణ్ ఆ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చరణ్ తన పూర్తి శ్రద్ధను ఆ చిత్రంపైనే ఉంచుతున్నాడు. ఆ సినిమా ద్వారా ఎలాగైనా దేశ వ్యాప్తంగా తనకు వచ్చిన గుర్తింపును రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నాడు. అందుకే ఆ సినిమాని ఎవరూ ఊహించని విధంగా చేయాలని దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడు.
 
ఈ చిత్రం తర్వాత కూడా ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయడం అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. చరణ్ మంచి దర్శకులతో సినిమాలు అయితే ఓకే చేసుకుంటున్నాడు కానీ హిట్ కొట్టి విషయంలో కొంత వెనుకబడి పోతున్నాడు అనే వాదన ఎప్పటి నుంచో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో  కొనసాగు తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సెంటిమెంట్ ను కాదని చేస్తున్న ఈ సినిమాలు ఏ స్థాయిలో ఆయనకు విజయాన్ని తెచ్చి పెడతాయో చూడాలి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో కూడా ఓ చిత్రాన్ని త్వరలోనే చేయబోతున్నాడు రామ్ చరణ్.  ఇది ఎంతో వెరైటీ చిత్రం గా తెరకేక్కుతుందని అంటున్నారు.నేషనల్ అవార్డు అందుకున్న ఈ దర్శకుడు రామ్ చరణ్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: