మెగాస్టార్ చిరంజీవి కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయం లోనే రాజకీయాల వైపు దృష్టి మళ్లించి సినిమాలకు కొన్ని సంవత్సరాల పాటు దూరం అయ్యాడు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 మూవీ తో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి లాంటి పాన్ ఈ దిల్ సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో హీరోగా నటించాడు.

ఆచార్య సినిమాలో చిరంజీవి తో పాటు ఫుల్ లెన్త్ లో రామ్ చరణ్ కూడా నటించడం  , ఆచార్య సినిమా వరకు ఒక్క అపజయం కూడా లేని కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో మెగా అభిమానులతో పాటు మామూలు సినీ అభిమానులు కూడా ఆచార్య సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరిగింది. అలా భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఆచార్య సినిమా విడుదల అయిన మొదటి రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అలా నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా  కలెక్షన్లు కూడా రోజు రోజుకు తగ్గుతూ వచ్చాయి.

మొదటి రోజున మినహాయిస్తే ఆచార్య సినిమాకు  రెండవ రోజు నుంచి కలెక్షన్లు తీవ్రంగా తగ్గుతూ వచ్చాయి.  దాదాపుగా 131.20 కోట్ల  ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న ఆచార్య సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 48.36 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించగా , 76 కోట్ల  గ్రాస్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. 132.50 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఆచార్య సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ ఫార్ములాకు 84.14 కోట్ల దూరంలో ఉంది. కాకపోతే ఆచార్య సినిమా 'ఓ టి టి' స్ట్రీమింగ్  తేదీ కూడా రావడంతో ఇక ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. దానితో ఆచార్య సినిమాకు దాదాపుగా 84 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: