టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి బ్లాక్బస్టర్ సినిమాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తి అయ్యింది. 

ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే లైగర్ సినిమా సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో జన గణ మన సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి రెండు అదిరిపోయే అప్డేట్లను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ రోజు విజయ్ దేవరకొండ ,శివ నిర్వాణ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న  సినిమా టైటిల్ ను మరియు విడుదల తేదీని చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు.  విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ను ఖుషి  గా పిక్స్ చేశారు. అలాగే ఈ సినిమాను 23 డిసెంబర్ 2022 న తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళ, భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ ద్వారా తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: