అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా తెరకెక్కిన సినిమా ఎఫ్ 3.  ఇప్పటికే ఎఫ్ 2 విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోవడంతో ప్రేక్షకులు ఎఫ్ 3 సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు.  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఎఫ్ 3 సినిమా మే 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఎఫ్ 3 చిత్ర బృందం లోని సభ్యులు పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో , పలు సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఎఫ్ 3 సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. 

అలాగే ఈ సినిమా నుండి వరుస పెట్టి ప్రచార చిత్రాలను, సాంగ్స్ ని , టీజర్,  ట్రైలర్ లను విడుదల చేస్తూ కూడా ఈ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఎఫ్ 3 సినిమా నుండి 'లైఫ్ అంటే ఇట్టా వుండలా'  అనే సాంగ్ ప్రోమో వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.  

ఈ స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ ప్రోమో సాంగ్ లో పూజా హెగ్డే తన అందచందాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.  'లైఫ్ అంటే ఇట్టా వుండలా' పూర్తి సాంగ్ మే 17 వ తేదీన విడుదల కాబోతుంది.  ఇది ఇలా ఉంటే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.  సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: