టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ డైరెక్షన్లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు.ఇక ఈ సినిమా రిలీజ్ రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే 135 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో రీజనల్ సినిమాగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా USAలో కూడా వసూళ్ల సునామి కురిపిస్తుంది.మన తెలుగు సినిమాలకి అమెరికా దేశం పెద్ద మార్కెట్. మన తెలుగు సినిమాలన్నీ అక్కడ చాలా బాగా ఆడతాయి.ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ సినిమాలకి అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే అమెరికాలో 1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాలు సూపర్ స్టార్ మహేష్ బాబుకి 11 ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ హీరోకి లేనటువంటి రికార్డు ఇదే. అత్యధిక 1 మిలియన్ సినిమాలు కలిగిన హీరోగా మహేష్ బాబు పేరిట ఈ రికార్డు ఉంది. తాజాగా సర్కారు వారి పాట సినిమాతో మరో రికార్డు మహేష్ బాబు తన ఖాతాలోకి వేసుకున్నారు.



సర్కారు వారి పాట సినిమాకి ఇప్పటికే అమెరికాలో 2 మిలియన్ డాలర్ల వసూళ్లను దాటేశాయి. ఇక రీజనల్ సినిమాలతో USA మార్కెట్ లో వరుసగా 4 సినిమాలకి 2 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన హీరోగా మహేష్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి దాకా పాన్ ఇండియా సినిమాలు తప్ప మరే హీరో ఒక్క తెలుగు సినిమాతో ఈ రికార్డుని సాధించలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు వరసగా శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు ఇంకా అలాగే సర్కారు వారి పాట సినిమాలతో అమెరికా మార్కెట్ లో 2 మిలియన్స్ డాలర్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసాడు మహేష్. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల్లో ఈ సినిమా ఇంకా మరిన్ని రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: