బాలివుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ధాకడ్ చిత్రం తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత రెండు మూడు వారాల నుంచి ఈ సినిమా ప్రమోషన్ ను బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు చిత్ర బృందం. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని విషయాలను మీడియా ద్వారా వెల్లడిస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నది కంగనా రనౌత్. మరొకసారి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరోలను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.


బాలీవుడ్ తో పాటు అన్ని మూవీస్ లో కూడా ఒక హీరో సినిమాకు మరో హీరో ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఒక హీరోయిన్ సినిమాలు మాత్రం మరొక హీరోయిన్ ప్రమోట్ చేయడం జరుగుతూ ఉండనే ఉంటుంది. ఇలా చేయడం వల్ల తరచు వీరందరి మధ్య స్నేహం  మారుతూ ఉంటారు. కానీ కంగనా రనౌత్ మాత్రం ఈ విషయంలో తనకు ఏ ఒక్క స్టార్ ప్రమోషన్లలో హెల్ప్ ఇవ్వడం లేదని చాలా అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది తన సినిమాలను ప్రమోట్ చేసేందుకు భయపడతారని.. ఎందుకంటే వారు వారి కంటే తనకు ఎక్కువ క్రేజ్, గుర్తింపు వస్తుందేమో అని భయం ఉందని తెలియజేసింది.

ఎలాగైనా తన సినిమాను తొక్కేయాలని చూస్తూ ఉంటారని కంగాన  ఆరోపణలు చేస్తోంది. హీరోయిన్ గా కంగనా రనౌత్ ఈ మధ్య కాలంలో కాస్త సినిమాలు తగ్గించినప్పటికీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఎక్కువ గా నటిస్తోంది. యువ హీరోలు సైతం ఈ మధ్య సినిమాల్లో చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. కంగనా రనౌత్ కూడా స్టార్ హీరోలతో సినిమా చేయడం అనేది చాలా కష్టమని మీడియా వర్గాల మధ్య తన అభిప్రాయమని తెలియజేసింది కంగనా. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల పై, హీరోలపై విమర్శలు చేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: