టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని అఖిల్ 'అఖిల్' మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హలో,  మిస్టర్ మజ్ను , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలలో అఖిల్ నటించాడు.  ఇలా అఖిల్ ఇప్పటి వరకు నాలుగు సినిమా లలో నటించగా అందులో కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రమే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా,  మిగతా మూడు సినిమాలు మాత్రం బాక్సాఫీసు దగ్గర ఈ హీరో కి నిరాశనే మిగిల్చాయి.  

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అవుతుంది.  కాకపోతే మధ్యలో కొంత కాలం కారోనా వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడడం,  ఆ తరువాత మరి కొన్ని కారణాల వల్ల షూటింగ్ డిలే అవుతూ రావడం వల్ల అఖిల్ 'ఏజెంట్' సినిమా చాలా స్లోగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

ఏజెంట్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ సినిమా నుండి కేవలం ఒకటి,  రెండు పోస్టర్ లను మినహాయిస్తే పెద్దగా ఎ అప్డేట్ లు కూడా బయటకు రాలేదు.  ఇది ఇలా ఉంటే ఏజెంట్ సినిమాను 12 ఆగస్టు 2022 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చినప్పటికీ ఈ సినిమా నుండి ఇప్పటివరకు టీజర్ కానీ , ఒక్క సాంగ్ కానీ విడుదల కాలేదు.  దీంతో ఈ సినిమా ఆగస్టు 12 వ తేదీన విడుదల కావడం కష్టమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.  మరి ఈ సినిమా చిత్ర బృందం చెప్పిన తేదీ ఆగస్టు 12 న విడుదల చేస్తారా... లేకపోతే వేరే ఏదైనా విడుదల తేదీని ప్రకటిస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: