టాలీవుడ్ నటులలో ఒకరు అయిన సునీల్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సునీల్ కెరియర్ ప్రారంభంలో కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కమెడియన్ గా  మంచి క్రేజ్ ను సంపాదించుకున్నడు.  అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కమెడియన్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సునీల్  దాదాపు అందరు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. అలా కమెడియన్ గా ఎంతోమంది మనసులను దోచుకున్న సునీల్ ఆ తర్వాత అందాల రాముడు సినిమాలో హీరోగా నటించాడు.

ఈ సినిమాలో సునీల్ సరసన ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా సునీల్ కు హీరోగా కూడా మంచి గుర్తింపును తీసుకు వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమాల్లో కమెడియన్ పాత్రల్లో నటించిన సునీల్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాద రామన్న సినిమాలో మరోసారి హీరోగా నటించాడు. మర్యాద రామన్న సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఆ తర్వాత నుండి సునీల్ కమెడియన్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాల్లో హీరోగా నటిస్తూ వచ్చాడు.  కాకపోతే సునీల్ హీరోగా నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ప్రస్తుతం సునీల్ హీరో పాత్రలలో మాత్రమే కాకుండా కమెడియన్ పాత్రలలో , ఇతర పాత్రల్లో కూడా నటిస్తున్నాడు.

అందులో భాగంగా సునీల్ తాజాగా  పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. సునీల్ తాజాగా  ఎఫ్ 3 సినిమాలో నటించాడు. ఎఫ్ 3 సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది. సందర్భంగా సునీల్ మరియు ఎఫ్ 3 మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ కి గెస్ట్ లుగా వచ్చారు. అందులో భాగంగా ఆలీ,  సునీల్ ని పుష్ప సినిమా తర్వాత వేరే భాషల నుండి ఏమైనా ఆఫర్ లు వస్తున్నాయి అనే ప్రశ్నను అడగగా... ఆ ప్రశ్నకు సునీల్ తమిళం మరియు హిందీ భాషల నుండి ఆఫర్ లు వస్తున్నాయి అని సమాధానమిచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: