సౌత్ సినిమా పరిశ్రమలోని సినిమాలు పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన విషయం తెలిసిందే. అలా చాలా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దానికి తగ్గట్లుగానే దక్షిణాది సినిమా మేకర్స్ అందరూ కూడా జాతీయ స్థాయిలో తమ సినిమాను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా సౌత్ సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఏదేమైనా సౌత్ సినిమాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు.

ఇటీవల కాలంలో వచ్చిన సౌత్ పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూలు సునామీని సృష్టించాయి. కొన్ని చిత్రాలు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాయి.అలా ఇప్పుడు మరికొన్ని సౌత్ పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మేజర్, అంటే సుందరానికి, విక్రమ్ మరియు 777 చార్లీ చిత్రాలు ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి జూన్ నెలలో రాబోతున్నాయి. 

అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా జూన్ 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. శశికిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించడం విశేషం. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న విక్రమ్ సినిమా జూన్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలలో జూన్ 3వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి చిత్రం జూన్ పదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న రక్షిత్ శెట్టి 777 చార్లీ అనే సినిమా ద్వారా జూన్ 10వ తేదీన పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: