ఆచార్య సినిమా యొక్క ప్రభావం కొరటాల శివ పైన బాగానే పడింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వక పోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో కొరటాల శివ సినిమా తర్వాత చేయబోయే సినిమా పై ఆచార్య ప్రభావం ఏవిధంగా పడకూడదు అని ఆ సినిమాకు స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నారు కొరటాల. త్వరలోనే ఎన్టీఆర్ తో కలిసి ఆయన ఓ భారీ మూవీకి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే.

ఆచార్య ఫ్లాప్ గా మారడంతోనే ఎన్టీఆర్ సినిమా పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారట. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ సినిమా పై రకరకాల వదంతులు వస్తున్నాయి. అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న పరిస్థితి కారణంగా ఈ విధమైన పరిస్థితచెబుతున్నారు. ఆ విధంగా ఉంటే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని ఎన్టీఆర్ అభిమానులు కలవరపడుతున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన ప్రకటనలు రాబోతున్నాయి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేసి ఈ సినిమా గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారు.

కొరటాల శివ రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్నారు.పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ మూవీ వచ్చే ఏడాదే విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత తను చేసే ప్రతి సినిమా కూడా ఆ స్థాయి సినిమాలే ఉండాలని ఎన్టీఆర్ అనుకోవడం కొరటాల శివ కూడా ఆ రకమైన సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 20వ తేదీన ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేసి సినిమాపై రూమర్ల పై ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: