కొంత కాలం పాటు రెండు తెలుగు రాష్ట్రాల  సిఎం లను టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్ లను పెంచుకునే వెసులు బాటు ను కల్పించాలని విజ్ఞప్తి చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. దానితో స్పందించిన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ బడ్జెట్ సినిమా లకు ఆ సినిమా బడ్జెట్ కు అనుగుణంగా సినిమా టికెట్ రేటు లను పెంచుకునే వెసులు బాటును కల్పించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 5 షో  లను వేసుకొనే వెసులుబాటును కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.

దీనితో భారీ బడ్జెట్ సినిమాలకు ఈ వెసులుబాటు బాగా కలిసి వచ్చింది. కాకపోతే సినిమా చూసే ప్రేక్షకులకు మాత్రం ఇది  పెద్ద సమస్యగా మారింది.  సినిమా టికెట్ రేట్లు అధికంగా  ఉండడం వల్ల సినిమా థియేటర్ లో చూడడానికి వారు కాస్త ఆలోచించే అవసరం వచ్చేలా ఆ టికెట్ రేట్లు చేశాయి.  ఇది ఇలా ఉంటే దిల్ రాజు నిర్మాతగా , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమాకు కూడా భారీ టికెట్ రేట్లు ఉండే అవకాశం ఉంది అని అప్పట్లో అనేక వార్తలు బయటకు వచ్చాయి.  దానికి ప్రధాన కారణం ఎఫ్ 2 సినిమా ఇప్పటికే విజయవంతం సాధించడంతో,  దానికి సీక్వెల్ గా వస్తున్న ఎఫ్ 3 సినిమాకు  ప్రేక్షకుల్లో  భారీ అంచనాలు ఉన్నాయి.  

అలాగే ఈ సినిమాలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు.  ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సోనాల్ చౌహన్ కూడా నటించింది.  ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, ఈ మూవీ లో పూజా హెగ్డే ఒక స్పెషల్  సాంగ్ లో నటించింది. ఎన్నో ప్రత్యేకతలు  ఉన్న ఎఫ్ 3 సినిమాకు కూడా భారీ టికెట్ రేట్లు ఉంటాయి అని అందరూ అనుకున్నారు.  కాకపోతే నిర్మాత దిల్ రాజు ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు మాత్రమే ఎఫ్ 3 మూవీ కి ఉంటాయి అని,  ఇలాంటి టికెట్ రేట్లు పెంపుదల ఎఫ్ 3 మూవీ కి ఉండదు అని తాజాగా స్పష్టం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: