పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వేణు శ్రీరామ్ తీసిన వకీల్ సాబ్ మూవీ తో కొంత గ్యాప్ అనంతరం సినిమాల్లోకి రి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ మంచి విజయం సొంతం చేసుకుంది. అనంతరం కొన్నాళ్ల క్రితం మరొక యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తో పవన్ చేసిన సినిమా భీమ్లా నాయక్. రానా మరొక కీలక రోల్ చేసిన భీమ్లా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడితో హరిహర వీరమల్లు అనే భారీ పెరియాడికల్ యాక్షన్ మూవీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. 

నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరికి సంక్రాంతి పండుగ సమయంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే మరోవైపు ఇటీవల ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ తో భారీ సక్సెస్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే విషయం ఏంటంటే, ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఇటు బాబాయ్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, అటు అబ్బాయి రామ్ చరణ్ నటిస్తున్న శంకర్ సినిమాల పై కేవలం మెగా ఫ్యాన్స్ లో మాత్రమే కాదు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి అటు బాబాయ్, ఇటు అబ్బాయి ల సినిమాలు రెండూ కూడా వచ్చే ఏడాది జనవరి బాక్సాఫీస్ బరిలో నిలిచి ఢీ అంటే ఢీ అనేలా తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాలు పక్కాగా అదే సమయంలో రిలీజ్ అవుతాయో లేదో తెలియాలి అంటే పూర్తిగా వాటికీ సంబంధించి యూనిట్స్ నుండి అధికారిక అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: