అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేశ్ ,వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా మంచి విజయం సాధించిన విషయం మన అందరికీ తెలుసు.  ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించారు. మే 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ 3 సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఎఫ్ 2 సినిమా మంచి విజయం సాధించి ఉండడం,  అలాగే ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలు కాకపోవడంతో ఎఫ్ 3 సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఎఫ్ 3 మూవీలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమాలో ఆలీ, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.  సోనాల్ చౌహాన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. వీరితో పాటు ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇప్పటికే ఈ స్పెషల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ స్పెషల్ సాంగ్ వీడియో లో పూజ హెగ్డే  తన అందచందాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ లను చిత్ర బృందం వేగవంతం చేసింది.  

అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ విడుదల చేసింది.  ఎఫ్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  ఫెంటాస్టిక్ ఈవెంట్ పేరుతో మే 21 వ తేదీన సాయంత్రం 6 గంటలకు శిల్పకళావేదిక  హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు తాజాగా చిత్రం ఒక పోస్టర్ ద్వారా ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే మరి ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంశాలు కలిగి ఉన్న ఎఫ్ 3 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: