లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. విశ్వరూపం సినిమా తర్వాత వెండితెర ద్వారా ప్రేక్షకులను అలరించలేకపోయిన కమల హాసన్ 'విక్రమ్' సినిమా ద్వారా వెండితెరపై ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. విక్రమ్ మూవీ కి కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో కమల్ హాసన్ కేవలం నటించడం మాత్రమే కాకుండా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్  బ్యానర్‌ పై ఆర్ మహేంద్రన్‌ తో కలిసి విక్రమ్ మూవీ ని నిర్మించారు. 

మూవీ లో విజయ్ సేతుపతి , ఫహద్ ఫాసిల్  కీలకమైన పాత్రలలో నటిస్తుండగా.. హీరో సూర్య ఈ మూవీ లో అతిథి పాత్రలో అలరించనున్నారు.  విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడిన నేపథ్యం లో విక్రమ్ మూవీ  తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ఒక ప్రముఖ  సంస్థ దక్కించుకుంది. టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ 'విక్రమ్'  సినిమా తెలుగు రాష్టల  హక్కులను దక్కించుకుంది.  

విక్రమ్ సినిమా తెలుగు రాష్టల హక్కులను శ్రేష్ట మూవీస్ ఫ్యాన్సీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్సీ రేటుకు విక్రమ్ సినిమా తెలుగు రాష్టల హక్కులను దక్కించుకున్న శ్రేష్ట మూవీస్ ఈ సినిమా ప్రమోషన్ లను కూడా అదిరిపోయే రేంజ్ లో జరపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.  విక్రమ్ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా,  గిరీష్ గంగాధరన్ ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్‪గా పని చేశారు.  మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: