తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ గత రెండు సినిమాలతో హ్యట్రీక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. మొన్న విడుదల అయిన పుష్ప సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. మొదటి పాన్ ఇండియా సినిమాగా విడుదల బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో బన్నీ పర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉండటంతో, ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో ఈ సినిమాకు సీక్వెల్ను రెడీ చేసే పనిలో బన్నీ అండ్ టీమ్ ఉన్నారు.


మొదటి సినిమా కన్నా కూడా ఈ సినిమాను మరింత పవర్ ఫుల్ గా తెరకెక్కించాలని భారీ కసరత్తులను చేస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులను పూర్తీ చేసే పనిలో చిత్ర యూనిట్ బిజిగా వుంది.త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం అప్పుడే స్క్రిప్టులు వింటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ బన్నీకి ఓ స్టోరీలైన్ వినిపించగా, అది బన్నీకి బాగా నచ్చినట్లుగా తెలుస్తోంది..


అందుకు సినిమా స్క్రిప్టును కూడా పూర్తీ చేయమని బన్నీ చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి..ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును పూర్తి చేసే పనిలో మురుగదాస్ బిజీగా ఉన్నాడని.. త్వరలోనే ఈ స్క్రిప్టును పూర్తి చేసి బన్నీకి వినిపించాలని చూస్తున్నాడట. ఒక్కసారి బన్నీ ఈ కథను ఓకే చేస్తే.. భారీ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించాలని మురుగదాస్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ అనే ఫ్లాప్ మూవీని తెరకెక్కించిన మురుగదాస్‌కు టాలీవుడ్‌లో పెద్దగా మార్కెట్ లేదు. దీంతో ఆయనతో బన్నీ సినిమా చేస్తే రిస్క్ అవుతుందేమో అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి ఏమౌతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: