సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.  మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను సంపాదించుకొని ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది.  ఇలా సర్కారు వారి పాట సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో ప్రస్తుతం మహేష్ బాబు ఫుల్ ఖుషి లో ఉన్నారు.  మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట మూవీ లో  కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా,  వెన్నెల కిషోర్,  సముద్ర కని ఇతర ప్రధాన పాత్రలో నటించారు.  

మూవీ కి పరశురామ్ దర్శకత్వం వహించాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌ మబు పీకాక్‌ మ్యాగజైన్‌ నిర్వహించిన ర్యాపిడ్‌ ఫైర్‌ ఛాలెంజ్‌ లో ఎదురైన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలను ఇచ్చారు. ఈ రాపిడ్ ఫైర్ ప్రశ్న లో భాగంగా మహేష్ బాబు హాలీవుడ్ సినిమా లయన్ కింగ్ చూసి ఏడ్చినట్లుగా తెలియజేశాడు. అలాగే తను తరచు బ్యూటిఫుల్ అనే పదాన్ని వాడతాను అని ఈ ర్యాపిడ్  ఫైర్ లో భాగంగా తెలిపాడు. 

ఒక వేళ తాను కనుక డైరెక్టర్ ని అయితే ఒక్కడు మూవీ ని రీ క్రియేట్ చేస్తాను అని మహేష్ బాబు ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా తెలియజేశాడు.  మహేష్ బాబు ఈ ర్యాపిడ్  ఫైర్ లో భాగంగా  అల్లూరి సీతారామరాజు మూవీ తన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా అని మహేష్ బాబు తెలియజేశాడు.  ఇలా పీకాక్‌ మ్యాగజైన్‌ తాజాగా నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ లో మహేష్ బాబు అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: