యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత' సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. ఈ సినిమా మార్చి 25 వ తేదీన గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇలా ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అవ్వడం, బ్లాక్ బస్టర్ విజయం సాధించడం ఇలా అన్ని పనులు ముగియడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ కు ఇది  కెరియర్ పరంగా 30 వ సినిమా.  ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను తాజాగా చిత్ర బృందం బయటికి వదిలింది.  ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా,  రత్నవేలు ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా పని చేయబోతున్నాడు.  తాజాగా ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్,  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.  ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'సలార్' మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. 'సలార్' సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు.  

ఎన్టీఆర్ ఈ రెండు సినిమాల తర్వాత మరో టాలీవుడ్ టాప్ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటివరకు దర్శకత్వం వహించిన అన్ని సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర విజయాలను అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి , బాలకృష్ణ తో ఒక సినిమా తెరకెక్కించబోతున్నాడు.  ఆ తర్వాత ఎన్టీఆర్ తో అనిల్ రావిపూడి సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: