టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ రాజు కేవలం సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా సినిమాలను డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో తక్కువ బడ్జెట్ లో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కిస్తూ వచ్చిన దిల్ రాజు ఆ తర్వాత స్టార్ హీరోలతో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కిస్తూ వచ్చాడు.  ప్రస్తుతం మాత్రం దిల్ రాజు స్టార్ హీరోలతో పక్కా కమర్షియల్ సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ  వస్తున్నాడు.  

అందులో భాగంగా ప్రస్తుతం దిల్ రాజు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియా వైడ్ గా దర్శకుడిగా క్రేజ్ ఉన్న శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కీయారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా,  సునీల్ , అంజలి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.  ఈ సినిమా తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ ప్రధానపాత్రలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాను కూడా దిల్ రాజు ప్రస్తుతం  నిర్మిస్తున్నాడు.  

తాజాగా దిల్ రాజు నిర్మించిన ఎఫ్ 3 సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు...  మేము రాబోయే రెండు సంవత్సరాలలో బాహుబలి 2 , ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాము. ఈ రెండు సంవత్సరాల్లో మేము కనీసం ఒకటి లేదా రెండు భారీ బడ్జెట్ సినిమాల ప్రకటనలను ప్రకటించే అవకాశం ఉంది అని  తాజాగా దిల్ రాజు ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: