యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తాజాగా విక్రమ్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. విక్రమ్ సినిమాకు మానగరం, ఖైదీ, మాస్టర్ సినిమా లతో వరుస బ్లాక్బస్టర్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్న లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు.  విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.  ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తమిళ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ సినిమా తమిళ  ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదల తేదీకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. విక్రమ్ సినిమా  తెలుగు రాష్ట్రాల హక్కులను దక్కించుకున్న శ్రేష్ట మూవీస్ సంస్థ 'విక్రమ్'  సినిమా తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయనున్నట్లు,  విక్రమ్ సినిమా ట్రైలర్ ను రామ్ చరణ్ ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది.  

ఇది ఇలా ఉంటే ఇప్పటికే లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన మానగరం, ఖైదీ, మాస్టర్ సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలను సాధించడంతో , తాజాగా ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.  జూన్ 3 వ తేదీన విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న విక్రమ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాలో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: