ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాల సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. సంవత్సరానికి రెండు, మూడు సినిమాలను మినహాయిస్తే కామెడీ ప్రాధాన్యత పూర్తిగా ఉన్న సినిమాలు చాలా అరుదుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విడుదల అవుతున్నాయి. కాకపోతే కామెడీ ప్రాధాన్యత ఉన్న సినిమాలు కనుక థియేటర్లలోకి వచ్చినట్లు అయితే ప్రేక్షకులు ఆ సినిమాలకు మంచి ప్రాముఖ్యతను ఇస్తూ వస్తున్నారు. కామెడీ పూర్తి ప్రాధాన్యత ఉన్న సినిమా కనుక థియేటర్ లలో   పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లయితే ఆ మూవీ లకు అదిరిపోయే కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర వస్తున్నాయి.  

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కామెడీ పూర్తి నేపథ్యంతో తెరకెక్కిన తాజా సినిమా 'ఎఫ్ 3' మే 27 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.  ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ప్రతి ఈ సినిమాలోనూ  కామెడీకి ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాడు.  అందులో భాగంగానే  తాజాగా ఎఫ్ 3 సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి ఈ సినిమాను కూడా పూర్తి కామెడీ నేపథ్యంలో తెరకెక్కించాడు. ఎఫ్ 3  సినిమాలో  వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు.  

ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో నటించగా,  సునీల్ , ఆలీ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.  ఈ సినిమాలో పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది.  ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా,  ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.  సెన్సార్ బోర్డు సభ్యులు 'ఎఫ్ 3' సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ 'యూ'  ఇచ్చారు.  అలాగే ఈ సినిమా రన్ టైమ్ ను కూడా చిత్ర బృందం లాక్ చేసింది.  ఎఫ్ 3 సినిమా రన్ టైమ్ ని  2.28 నిమిషాలకు లాక్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: