జాతిరత్నాలు
సినిమా తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న దర్శకుడు అనుదీప్. అంతకు ముందు కొన్ని లఘు చిత్రాలతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న ఈ దర్శకుడు చేసిన తొలి
సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించాడు. ఈ
సినిమా ఆయనకు ఒక్కసారిగా స్టార్
డైరెక్టర్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది.
నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ
సినిమా ప్యూర్
కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఎంతో అలరించింది. అలా ఈ
సినిమా తెలుగు ప్రేక్షకులను కాదు ఇతర భాషల ప్రేక్షకులను కూడా మెప్పించడం తో ఇప్పుడు ఆ
సినిమా అక్కడ
రీమేక్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.
ఈ
సినిమా తర్వాత అనుదీప్ చేయబోయే
సినిమా పై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఏ
హీరో తో
సినిమా చేస్తాడా.. ఎలాంటి
సినిమా చేస్తాడా అన్న విషయమై ఎంతో ఉత్కంఠ నెలకొంది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ దర్శకుడు తన తదుపరి
సినిమా ను
తమిళ హీరో తో చేస్తున్నాడు.
శివ కార్తికేయన్ హీరోగా ఓ
సినిమా ను అనుదీప్ తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
తమన్ ఈ
సినిమా కి సంగీతం సమకూరుస్తున్నాడు. తొలిసారి ఈ హీరోకి
తమన్ సంగీతం సమకూరుస్తుండడం విశేషం.
అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఈ
సినిమా చేయడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. తమిళనాడు లో
శివ కార్తికేయన్ కు మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు వరుస విజయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ విజయ పరంపర ను కొనసాగించాల్సిన అవసరం అనుదీప్ పై ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడు ఈ పెద్ద
హీరో సినిమా ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. త్వరలోనే ఈ
సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమాలో నటించబోయే నటీనటుల గురించి అధికారిక ప్రకటన త్వరలో రాబోతుంది.