తమిళనాడులో భారీ ఇమేజ్ కలిగిన హీరో విజయ్ దళపతి ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా ను చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన బీస్ట్ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదల కాగా ఆ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. సినిమా విడుదలకు ముందు ఉన్న హైప్ తర్వాత కంటిన్యూ చేయలేకపోయింది. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అందరిని మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో విజయ్ తన తదుపరి సినిమా ను హిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వంశీ పైడిపల్లి కూడా ఈ సినిమా తో హిట్ కొట్టాల్సిన వత్తిడి నెలకొంది.

తెలుగు వరుస మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న వంశీ పైడిపల్లి సడెన్ గా తమిళ హీరో తో సినిమా చేయడం అందరిని ఎంతో ఆశ్చర్య పరిచింది. చాలామంది విమర్శలను ఎదుర్కొన్నారు కూడా.. తెలుగు లో హీరోలు లేనట్లు తమిళ హీరో తో ఇంత మంచి టాలెంటెడ్ డైరెక్టర్ సినిమా చేయడం చాలా మందికి నచ్చలేదు. కానీ ఆ కథ కు విజయ్ అయితేనే సూట్ అవుతాడని వంశీ పైడిపల్లి నమ్మాడు. ఈ నేపథ్యంలో కథను ఆయనకు వినిపించడం ఆయన దానికి ఒకే చెప్పడం జరిగిపోయాయి. ఇందులో కథానాయికగా రష్మిక నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు జరిగాయి.

త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ దళపతి రెండు సర్ప్రైజ్ లు ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ను తొందరగా మొదలుపెట్టి జనవరి లో విడుదల చేయాలనీ విజయ్ ప్లాన్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే తెలుగు వెర్షన్ కి తెలుగు నటులను, తమిళ వెర్షన్ కు తమిళ నటులను ఎంపిక చేయనున్నారు.   అయితే అప్పుడే మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు విజయ్. ఈ నేపథ్యంలో ఆయన తెలుగు దర్శకుల పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. కారణం ఏదైనా ఆయన తెలుగు దర్శకులతో సినిమాలు చేయడం విజయ్ తెలుగు అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమా ను కూడా దిల్ రాజు నిర్మిస్తూ ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: