యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్వరలో రెండు సినిమాలు పట్టాలెక్కనున్న విషయం తెల్సిందే. ఇటీవల మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతో పెద్ద సక్సెస్ కొట్టింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కించగా ఇందులో ఎన్టీఆర్ కొమురం భీంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. అయితే నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు సహా పలు ఇతర ప్రాంతాల్లో ఆయన ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ చేయడంతో పాటు పలు సామజిక సేవా కార్యక్రమకాలు కూడా నిర్వహిస్తున్నారు. 

మరోవైపు ఎన్టీఆర్ నటించనున్న ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 మూవీస్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసారు నిర్మాతలు. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ వారు నిర్మించనున్న సినిమా మోషన్ పోస్టర్ నిన్న నైట్ రిలీజ్ అయి సినిమాపై అందరిలో విపరీతంగా అంచానాలు పెంచింది. అయితే దాని తరువాత నేడు మధ్యాహ్నం ప్రశాంత్ నీల్ తో తదుపరి ఎన్టీఆర్ చేయబోయే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. మైత్రి మూవీ మేకర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు దీనిని ఎంతో భారీగా నిర్మించనున్నాయి. 

అయితే విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ 31 ఫస్ట్ లుక్ బాగున్నప్పటికీ కూడా ఆ లుక్ లో ఎన్టీఆర్ ని చూస్తుంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ గతంలో తాను తీసిన కెజిఎఫ్ సినిమాలతో పాటు ప్రస్తుతం ప్రభాస్ తో తీస్తున్న సలార్ సినిమాల్లోని తన హీరోల మాదిరిగా ఎన్టీఆర్ లుక్ ని ప్రెజెంట్ చేసారని, ముఖ్యంగా దీనిని బట్టి చూస్తుంటే దర్శకుడు నీల్ కి హీరోలని బ్లాక్ షేడ్ లో చూపించడం ఇష్టంలా ఉందని కొందరు షాక్ అవుతూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇన్నర్ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ నటిస్తున్న ఈ రెండు సినిమాలు కూడా ఒక దానిని మించేలా మరొకటి అద్భుతంగా తెరకెక్కనున్నట్లు టాక్. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ బర్త్ డే కి రిలీజ్ అయిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: